ప్రశాంత వాతావరణంలో వేడుకలు నిర్వహించాలి

శాంతి కమిటీ సమావేశంలో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి   నిజామాబాద్, బతుకమ్మ : ప్రశాంత వాతావరణంలో వినాయక చతుర్థి, మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో బుధవారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సంబంధిత అధికారులకు కీలక సూచనలు చేశారు. మిలాద్-ఉన్-నబీ, గణేష్ ఉత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన చర్యలు, అందుబాటులోకి తేవాల్సిన సదుపాయాల గురించి సార్వజనిక్ గణేష్ మండలి...