Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 March 2025, 8:16 pm Posted by : ramakrishna

దుబాయ్ లో మాన్య శ్రీ కాన్సీరాం జయంతి వేడుకలు

బతుకమ్మ,వెబ్ న్యూస్ : భారతదేశ రాజకీయాల్లో చరిత్ర మైలురాయిగా నిలిచిన బహుజన వర్గాల రాజకీయ నాయకుడు మాన్య శ్రీ కాన్సీరాం 91 వ జయంతి వేడుకల కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం దుబాయ్ అల్ కోస్ లో ధర్మ సమాజ్ పార్టీ  నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. అనంతరం డి.ఎస్.పి నాయకులు మాట్లాడుతూ “భారతదేశ రాజకీయాల్లో చరిత్ర మైలురాయిగా నిలిచిన బహుజన రాజకీయ యోధుడు, అణగారిన వర్గాలను అధికార సింహాసనంపై నిలిపిన గొప్ప నాయకుడు మాన్య శ్రీ కాన్సీరాం అని ఆయన చూపిన సామాజిక పరివర్తన మార్గం నేటి యువతరానికి  స్పూర్తిదాయకమైనదని అన్నారు. కాన్సీరాం చూపిన రాజ్యాధికార సాధన మార్గంలో ధర్మ సమాజ్ పార్టీ ప్రయాణిస్తూ సబ్బండ వర్గాల ప్రజలను ఏకం చేస్తుందని రాబోయే రోజుల్లో బహుజనులే పరిపాలించే చైతన్యం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కిషోర్, శ్యామ్ కుమార్, సురేష్, శ్రావణ్, సంతోష్, దేవన్న, సునీల్, రంజిత్, ప్రవీణ్, భోజన్న, సురేష్, కిరణ్ మహారాజ్ తదితరులు పాల్గొన్నారు.