Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 October 2025, 2:14 pm Posted by : ramakrishna

రియాజ్ ఎన్ కౌంటర్ నేపథ్యంలో సంబరాలు

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

పోలీస్ కానిస్టేబుల్ ను హతమార్చి తప్పించుకు తిరుగుతున్న రియాజ్ చివరకు పోలీస్ కాల్పుల్లో హతమవ్వడంతో సంబరాలు నిర్వహించారు.  నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక మూడవ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన సీసీఎస్  కానిస్టేబుల్ ప్రమోద్ ఈనెల 17న పాత నేరస్తుడు రియాజ్ ను పట్టుకుని స్టేషన్ కు తరలిస్తుండగా అతడు కత్తితో పొడిచి హత్య చేసి పరారైన విషయం తెలిసిందే. అనాడు మరో ఇద్దరు సిసిఎస్ ఎస్ఐలు కూడా రియాజ్ గాయపరిచాడు. ఈ నేపథ్యంలో రియాజ్ ను పట్టుకుని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ పెరిగింది.

 

Celebrations in the wake of Riyaz encounter

ఆదివారం రియాజ్ ఎన్ కౌంటర్ అయ్యాడని జోరుగా ప్రచారం జరిగిన అతడు గాయాలతో చిక్కి ఆసుపత్రి పాలు కావడంతో సోషల్ మీడియాలో రియాజ్ ఎన్ కౌంటర్ వార్తలు పోలీస్ అధికారులు కొట్టిపారేశారు. చివరకు సోమవారం ఆసుపత్రి నుంచి తప్పించుకునే క్రమంలో పోలీసులపై ఎదురు దాడికి దిగిన దుండగుడు రియాజ్ ఖతమవ్వడంతో పోలీస్ అధికారులు ప్రశంసిస్తు పోస్టింగ్ లు పెడుతున్నారు. అదే సమయంలో నగరంలోని మూడవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో హమల్ వాడి చౌరస్తా లో స్థానికులు పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.