Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 August 2025, 6:10 pm Posted by : ramakrishna

లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని ఎమ్మెల్యేకు వేడుకలు

  • డబుల్  బెడ్ రూమ్ బాధితుడు జెగ్గ గంగాదాసు

 

ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు ఇల్లు పట్టాలు లేక ఆందోళనకు గురవుతున్నారు.దీంతో డబుల్ బెడ్ రూమ్ బాధితుడు జెగ్గ గంగాదాసు మాట్లాడుతూ తమకు ప్రభుత్వ పరంగా ఇళ్ల పట్టాలి ఇచ్చి ఇంటింటికి కరెంటు మీటర్ బాక్సులు,అదనంగా మరో రెండు బోర్లను వేసి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.అలాగే డ్రైనేజీ వ్యవస్థను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తమకు ఇల్లు నిర్మించి ఇచ్చినప్పటికీ కనీస సౌకర్యాలు లేకపోవడంతో తాము ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి స్థానిక నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి స్పందించి తమ సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా కృషి చేయాలని బతుకమ్మ మీడియా ద్వారా కోరారు. స్థానిక ఎమ్మెల్యే  భూపతి రెడ్డి దృష్టికి తమ సమస్యలు తీసుకపోవడం జరిగిందన్నారు. కానీ ఇప్పటివరకు సమస్యలు తీరడం లేదని అన్నారు.కొందరు గ్రామస్తులు,నాయకులు డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులను బెదిరిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఇలాగే బెదిరింపులు కొనసాగిస్తే వారికి తగిన గుణపాఠం చెప్పడం జరుగుతుందన్నారు.కావున డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల పైన ఎవరైనా జోలికి వస్తే ఉపేక్షించేది లేదని అన్నారు.ఈ కార్యక్రమంలో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.