Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 February 2025, 11:59 am Posted by : ramakrishna

ఘనంగా పిఆర్ టియు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

ఉపాధ్యాయులకు భవిష్యత్తులో కూడా అండగా ఉండే సంఘం ఒక్క  పిఆర్ టియు టిఎస్ మాత్రమే అని, రాబోయో ఉపాధ్యయ శాసన మండలి ఎన్నికల్లో వంగ మహేందర్ రెడ్డి ని గెలిపించి సంఘానికి  మరింత బలాన్ని ఇవ్వాలని జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శుల మోహన్ రెడ్డి,కిషన్ లు పిలుపు నిచ్చారు. నిజామాబాద్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు మోహన్ రెడ్డి కిషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ పిఆర్టియు సంఘ భవనంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అదివారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పలు సంవత్సరాలు వివిధ హోదాల్లో సంఘానికి విద్యారంగానికి సేవలందించినటువంటి రామారావు, సాయిలు, జ్యోతి, భవoతి గోవర్దన్,రాజేందర్ గౌడ్,నర్సింహ రెడ్డి,సుదర్శన్ గౌడ్ ,రాజేందర్ సింగ్ లను సన్మానించి సత్కారించారు.

Celebrating the foundation day of PRTU

ఈ కార్యక్రమంలో సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ ఉపాధ్యాయుల జీవనస్థితిగతులను మార్చి,ఎన్నో సమస్యలను పరిష్కరించిన ఏకైక సంఘం పిఆర్ టియు మాత్రమే అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో జిల్లా మహిళ అసోసియేట్ అధ్యక్షురాలు సరిత, ఉపాధ్యక్షురాలు వరలక్ష్మి,రాధ , ఎంఎల్ సి ఎలక్షన్ కోఆర్డినేటర్ రవీందర్ రెడ్డి,సోషల్ జిల్లా ఉపాధ్యక్షులు చిలుక శ్రీనివాస్, శ్రీనివాస్ గౌడ్ వివిధ మండలాల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు ,నాయకులు పాల్గొన్నారు.

Celebrating the foundation day of PRTU