ఘనంగా స్వామి వివేకానంద 163వ జయంతి
బిచ్కుంద బతుకమ్మ : బిచ్కుంద మండల కేంద్రంలోని వివేకానంద పాఠశాలలో స్వామి వివేకానంద 163వ జయంతి కార్యక్రమాన్ని వివేకానంద ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివేకానంద ఉత్సవ సమితి అధ్యక్షులు రచ్చ శివకాంత్ మాట్లాడుతూ, స్వామి వివేకానంద జీవితం, ఆయన యువతకు అందించిన ప్రేరణ, దేశాభివృద్ధిలో యువశక్తి పాత్ర గురించి, విద్యార్థులు, యువత స్వామి వివేకానంద ఆదర్శాలను అలవరుచుకుని ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని వివరించారు. ప్రధాన కార్యదర్శి సీమ గంగారాం వివేకానంద బోధనలు నేటి యువతకు మార్గదర్శకమని,...