Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 January 2026, 4:24 pm Posted by : ramakrishna

ఘనంగా స్వామి వివేకానంద 163వ జయంతి

బిచ్కుంద బతుకమ్మ :

 

బిచ్కుంద మండల కేంద్రంలోని వివేకానంద పాఠశాలలో  స్వామి వివేకానంద 163వ జయంతి కార్యక్రమాన్ని వివేకానంద ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివేకానంద ఉత్సవ సమితి అధ్యక్షులు రచ్చ శివకాంత్  మాట్లాడుతూ, స్వామి వివేకానంద జీవితం, ఆయన యువతకు అందించిన ప్రేరణ, దేశాభివృద్ధిలో యువశక్తి పాత్ర గురించి, విద్యార్థులు, యువత స్వామి వివేకానంద ఆదర్శాలను అలవరుచుకుని ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని వివరించారు. ప్రధాన కార్యదర్శి సీమ గంగారాం వివేకానంద బోధనలు నేటి యువతకు మార్గదర్శకమని, వాటిని ఆచరణలో పెట్టినప్పుడే సమాజం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివేకానంద ఉత్సవ సమితి అధ్యక్షులు రచ్చ శివకాంత్, ప్రధాన కార్యదర్శి సీమ గంగారాం, సభ్యులు వాసరే నాగనాథ్, ఉమాకాంత్, హనుమంత్ రావు, తపస్ బిచ్కుంద అధ్యక్షులు ముత్యాల సందీప్,  ప్రధాన కార్యదర్శి పేర్ శెట్టి శంకర్, వివేకానంద పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్, పండరి విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

 

Celebrating Swami Vivekananda's 163rd birth anniversary in grand style
Celebrating Swami Vivekananda’s 163rd birth anniversary in grand style