ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుక

ఆర్మూర్, బతుకమ్మ : కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సోనియా గాంధీ జన్మదిన వేడుకలను నాయకులు ఘనంగా నిర్వహించారు. నాయకులు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను, కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షుడు దోండి రమణ, అయ్యప్ప శ్రీనివాస్, ఎస్కే బబ్లూ, కొక్కెర భూమన్న, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.