Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 August 2024, 5:16 pm Posted by : ramakrishna

ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

రుద్రూర్,  బతుకమ్మ  : శ్రీ కృష్ణాష్టమి సందర్బంగా రుద్రూర్ మండల కేంద్రంలో శ్రీ కృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో సోమవారం శ్రీ కృష్ణాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో, ప్రధాన వీధుల గుండా పల్లకి సేవ నిర్వహించారు. చిన్నారులు వేసిన శ్రీకృష్ణ వేషధారణ పలువురుని ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలలో ఈ కృష్ణ యాదవ సంఘం అధ్యక్షులు దౌర్ సాయిలు, అక్కపల్లి నాగేందర్, కృష్ణ, శంకర్, వెంకటేష్, రవి కుమార్, యాదవ సంఘం సభ్యులు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

Celebrating Shri Krishnashtami...