Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 January 2025, 3:58 pm Posted by : ramakrishna

మానసిక వికలాంగుల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషకరం

నిజామాబాద్ సిటి, బతుకమ్మ : 

నగరంలోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్ స్ట్రక్షన్ లోని మానసిక, వికలాంగ విద్యార్థుల మధ్య లక్ష్మీ కళ్యాణ్ కిష్టపురం, స్నేహలత కిష్టపురంల కుమారుడు కార్తీకేయ మొదటి సంవత్సర జన్మదిన వేడుకలను నిర్వహించారు. నవీపేట్ కు చెందిన కళ్యాణ్ కిష్టపురం అమెరికా లో స్థిర పడ్డారు. తమ కుమారుడి మొదటి జన్మదిన వేడుకను
శనివారం స్నేహసొసైటీలో మానసిక, వికలాంగుల మధ్య కార్తీకేయతో కేక్ కట్ చేసి విద్యార్థులకు చాక్లెట్లు, బిస్కెట్లు అందజేశారు. అనంతరం విద్యార్థులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్తీకేయ తండ్రి కళ్యాణ్ మాట్లాడుతూ తమ కుమారుడి మొదటి జన్మదినం స్నేహ సొసైటీలో నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మానసిక, వికలాంగుల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం పట్ల వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తు లో స్నేహ సొసైటీకి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్. సిద్ధయ్య, స్నేహ సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు.

Celebrating birthdays among the mentally challenged is a joy