Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 December 2024, 2:18 pm Posted by : ramakrishna

ఘనంగా హోం గార్డ్స్ రైజింగ్ డే

నిజామాబాద్, బతుకమ్మ: జిల్లా పోలీసు కార్యాలయంలో 75వ హోమ్ గార్డ్స్ రైజింగ్ డేను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఉత్తమ సేవలందించిన హోం గార్డులకు అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) కోటేశ్వరరావు ప్రశంసాపత్రాలు అందజేశారు. హోంగార్డులు ఎమ్ స్వామి(633, ఆర్మూర్ పీఎస్), పి.పోతన్న(135, బోధన్ రూరల్), బి. జీవన్ సింగ్ (533, ట్రాఫిక్ పీఎస్), ఎస్ రఘువీర్ (210, మూడోటౌన్), షేక్ ఖాజా(679, నిజామాబాద్ ఏసీపీ ఆఫీస్) ప్రశంసాపత్రాలు అందుకున్నారు. కార్యక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్ ( ఏఆర్) శంకర్ నాయక్, ఆర్మ్ డ్ రిజర్వు ( అడ్మిన్) సతీశ్, (ఎంటీవో) తిరుపతి, సీసీఆర్ బి, సీఐ వీరయ్య, హోమ్ గార్డ్స్ సిబ్బంది పాల్గొన్నారు.