బతుకమ్మ: బిచ్కుంద : మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు (మిలాద్ ఉన్ నబీ) పర్వదినాన్ని ఆదివారం రాత్రి ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. బిచ్కుంద లోని పోలీస్ స్టేషన్ వద్ద గల మసీదులో ఏర్పాటు చేసిన సమావేశంలో ముస్లిం మత పెద్దలు షేక్ పాషా సెట్ మాట్లాడుతూ.. యువకులు మహమ్మద్ ప్రవక్త చెప్పిన మార్గంలో ప్రయాణిస్తే తిరుగులేని విజయాన్ని సాధిస్తారన్నారు. ప్రతి యువకుడు మహమ్మద్ ప్రవక్త జీవిత విశేషాలను తెలుసుకోవాలన్నారు. మిలాద్ఉన్ నబీ పర్వదినం సందర్భంగా పిల్లలకు నాథ్ నిర్వహించి బహుమతులను అందించామని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా పాషా సెట్ ఆధ్వర్యంలో ప్రజలకు మిఠాయిలు తదితర ఆహార పదార్థాలను పంచిపెట్టారు.
