ఘనంగా భీమాకోరేగావ్ శౌర్య దివాస్ వేడుకలు
ఆర్మూర్, బతుకమ్మ : మాలల హక్కుల కోసం నిరంతరం భీమా కోరేగావ్ మహర్ యుద్ధ వీరుల స్ఫూర్తితో పోరాడుదామని మాల సంఘాల జేఏసీ రాష్ట్ర కో-చైర్మన్ అంగరి ప్రదీప్ పిలుపునిచ్చారు. బుధవారం ఆర్మూర్ మండల కేంద్రంలో బీమా కోరేగావ్ 207వ శౌర్య దివస్‌ని పురస్కరించుకుని మాల సంఘాల జేఏసీ,అంబేద్కర్ యువజన సంఘం,దళిత ఐక్య సంఘటన, యశోబుద్ధ ఫౌండేషన్, వివిధ దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో భీమాకోరేగావ్ విజయ్ దివస్‌ను ఘనంగా నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌక్‌లో వివిధ దళిత సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి...