- ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ నిజాంబాద్ జిల్లా కార్యదర్శి రఘురాం మాట్లాడుతూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నో జిల్లాలో బెనారస్ యూనివర్సిటీలో ఆవిర్భవించి బ్రిటిష్ సామ్రాజవాదులకు వ్యతిరేకంగా ఈ దేశం నుండి తరిమికొట్టడంలో కీలకపాత్ర పోషించినటువంటి సంఘం ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాం అని ఉన్నారు. 89 సంవత్సరాలు పూర్తి చేసుకుని 90 సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా విద్య రంగ సమస్యల పైన ఎనలేని పోరాటాలు చేస్తూ విద్యార్థుల పక్షాన నిలబడినటువంటి ఏకైక సంఘం ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం అని అన్నారు. ఈ సందర్భంగా 90 సంవత్సరాల వార్షికోత్సవం ఈనేల 12 నుండి 30 వ తేదీ వరకు గ్రామ స్థాయి నుండి మండల,నియోజకవర్గం, జిల్లా స్థాయి వరకు ఘనంగా వార్షికోత్సవాలు నిర్వహించాలని నిర్ణయం చేశామన్నారు. వార్షికోత్సవంలో విద్యార్థులు మేధావులు ఏఐఎస్ఎఫ్ సంఘం నాయకులు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ఏఐఎస్ఎఫ్ యూనివర్సిటీ కన్వీనర్ సంజయ్, ఏఐఎకృష్ణ నిజాంబాద్ జిల్లా సహాయ కార్యదర్శి కుశాల్, నాయకులు నవీన్ కృష్ణ,సుభొద్, అబ్దుల్ రెహమాన్, కుమార్, శ్రీకాంత్, టోకు తదితరులు పాల్గొన్నారు.