సీఈసీ జ్ఞానేష్ కుమార్ ని తక్షణమే భర్తరఫ్ చేయాలి
ఇందూర్, బతుకమ్మ: ఎస్ఐఆర్ పేరుతో దేశవ్యాప్తంగా అర్హులైన కోట్లాదిమంది ఓటర్లను అక్రమంగా తొలగింపుకు కారకుడైన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ని తక్షణమే పదవి నుండి భర్త రఫ్ చేయాలని నిజామాబాద్ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది . యు ఎస్ పి సి రాష్ట్ర స్టీరింగ్ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఢిల్లీలో సిజెపి చేపడుతున్న చలో జంతర్ మంతర్ ఉద్యమానికి సంఘీభావంగా జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించడం...