ఇందూర్, బతుకమ్మ:
ఎస్ఐఆర్ పేరుతో దేశవ్యాప్తంగా అర్హులైన కోట్లాదిమంది ఓటర్లను అక్రమంగా తొలగింపుకు కారకుడైన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ని తక్షణమే పదవి నుండి భర్త రఫ్ చేయాలని నిజామాబాద్ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది . యు ఎస్ పి సి రాష్ట్ర స్టీరింగ్ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఢిల్లీలో సిజెపి చేపడుతున్న చలో జంతర్ మంతర్ ఉద్యమానికి సంఘీభావంగా జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఇట్టి ప్రదర్శనలో రాష్ట్ర నాయకులు వై. విజయకుమార్, డి. సత్యానంద్, పి. దాసు, పి.శంతన్ మాట్లాడుతూ… సీఈసీ జ్ఞానేష్ కుమార్ సిఈసి సభ్యుల ఆమోదం లేకుండా ఎస్ఐఆర్ ఫామ్ 6, 7 లలో అక్రమంగా మార్పులు చేయడంతో దేశవ్యాప్తంగా 13 కోట్లకు పైగా అర్హులైన వారి ఓట్ల తొలగింపుకు కారణమైందన్నారు. ఇట్టి చర్య రాజ్యాంగ విరుద్ధం, ఇద్దరూ సీఈసీ సభ్యుల ఆమోదం లేకుండా ఏకపక్షంగా సీఈసీ నియమావళికి విరుద్ధంగా ఒక రాజకీయ పార్టీకి లబ్ధి చేకూర్చే విధంగా వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం వల్ల దేశ పౌరుల ఓటు హక్కు ప్రమాదంలో పడిందన్నారు. అక్రమాలకు కారకుడైన సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ని తక్షణమే భర్తరఫ్ చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి)/రాజకీయ ప్రతిపక్షాలు చేపట్టిన ఉద్యమం గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా తీవ్ర రూపం దాల్చింది అన్నారు. సిఈసి జ్ఞానేష్ కుమార్ పదవి నుండి వైదొలగాలని లేదా భర్తరఫ్ చేయాలని డిమాండ్ దేశవ్యాప్తంగా ఊపందుకుంది. నేడు చలో జంతర్ మంతర్(ఢిల్లీ) కార్యక్రమం విఫలం చేయడానికి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లే రైలు అన్నింటిని రద్దు చేయడం దారుణం అన్నారు.

ఢిల్లీ మెట్రో రైళ్లు నిలిపివేయడం, తాగడానికి కనీసం నీరు దొరకకుండా చేయడం, వ్యాపార సంస్థలు మూసివేయడం, రాజధాని నలుదిక్కుల 30 వేల మంది పోలీసులు,పారా మిలిటరీ దళాలు పహారా కాసి సీజేపీ ఉద్యమకారులను ఢిల్లీలో అడుగుపెట్టకుండా ఢిల్లీని అష్టదిగ్బంధనం చేయడం, అభిజిత్ దీప్ కే తో పాటు సీజేపీ ముఖ్య నాయకులు ప్రయాణిస్తున్న విమానంలో పోలీసులు చొరబడి అక్రమంగా అరెస్టు చేయడంతో పాటు ఢిల్లీలో వేలాది మంది ఉద్యమ కారులను అక్రమంగా అరెస్టు చేయడం ,రాజ్యాంగం కల్పించిన హక్కులైన ధర్నాలు, నిరసనలు, ర్యాలీలను. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వ అణిచివేయడం రాజ్యాంగం కల్పించిన బావ ప్రకటన స్వేచ్ఛ హక్కులను కాలరాయడమే అవుతుందని రాష్ట్ర నాయకులు తెలిపారు. అరెస్టు చేసిన వేలాది మందిని తక్షణమే బే షరతుగా విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది .ఈ నిరసన ప్రదర్శనలో జిల్లా నాయకులు ఒ. రమేష్, ఎం. బాలయ్య, సిహెచ్. సుధా, గంగాధర్, ఒమాజీ, పోషన్న, , రాసరి పెంటన్న, భోజన్న, షేక్ మదర్,ఎల్. శ్రీధర్, సీతయ్య, బాలచంద్రం, షేక్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.