మెట్ పల్లి, బతుకమ్మ:
అంగన్ వాడి టీచర్ల వద్ద రూ.63 వేల లంచం తీసుకుంటూ మెట్ పల్లి ఐసీడీఎస్ సీడీపీవో పద్మ ఏసీబీకి చిక్కారు. శనివారం జగిత్యాల జిల్లా మెట్ పల్లి సీడీపీవో కార్యాలయంలో అంగన్ వాడి టీచర్ల వద్ద రూ.63 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ ఇంచార్జి డీఎస్పీ మధు ఆధ్వర్యంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇటీవల మెట్ పల్లి మండలంలో సీడీపీవో పద్మ అంగన్ వాడిలను తనిఖీ చేశారు. సంబంధిత తనిఖీ రిపోర్టును అనుకూలంగా రాసేందుకు లంచం డిమాండ్ చేశారు. బాధితులు ఏసీబీని ఆశ్రయించడంతో సీడీపీవో పట్టుబడ్డారు. సీడీపీవోను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.