సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి
బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న 18 గ్రామాల కల్లు డిపో యజమానులతో ఏ ఎస్ పి చైతన్య రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం ఎస్సై ఆంజనేయులు సమావేశం ఏర్పాటుచేశారు. ప్రతి కల్లు దుకాణాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి శాంతి భద్రతలకు సహకరించాలన్నారు. సిసి కెమెరాల వల్ల నేరాలను నియంత్రించవచ్చన్నారు. ఈ మధ్యకాలంలో కల్లు దుకాణంలో అధిక నేరాలు జరుగుతుండడంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీసులకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో కల్లు డిపో యజమానులు పోలీస్ సిబ్బంది ఉన్నారు.