- ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు
ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఆర్థిక సంస్థల్లో సీసీ కెమెరాలను తప్పనిసరిగా అమర్చాలని ఎల్లారెడ్డి ఎస్ఢీపీఓ శ్రీనివాస్ రావు ఆదేశించారు. ఎల్లారెడ్డి సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల ఆధీనంలో ఉన్న వివిధ బ్యాంకుల మేనేజర్లు, ప్రైవేట్ లోన్ సంస్థల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో డీఎస్పీ బ్యాంకులు, లోన్ సంస్థల వద్ద భద్రతను మరింత బలపరచాల్సిన అవసరాన్ని వివరించారు. విధిగా, బ్యాంకులు, లోన్ సంస్థల ప్రతినిధులు పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందజేస్తామని హామీ ఇచ్చారు.భద్రతా చర్యల అమలుకు తమ మద్దతు తెలియజేశారు. ఈ సమావేశం ద్వారా ఆర్థిక వ్యవహారాల భద్రతను పెంపొందించాలనే దృష్టితో ఎల్లారెడ్డి పోలీస్ శాఖ చేపట్టిన చర్యల్లో భాగంగా నిర్వహించారు. ఈ సమావేశంలో ఎల్లారెడ్డి, లింగంపేట్, నాగిరెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ల ఎస్ఐ లు మహేష్, దీపక్, భార్గవ్ పాల్గొన్నారు.
