నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
పేదలకు పంపిణీ చేసిన ప్రభుత్వ పిడిఎస్ బియ్యాన్ని అక్రమ మార్గంలో కొని తరలించడానికి మెకానిక్ షెడ్డులో నిలువ ఉంచిన పిడిఎస్ బియ్యం పై నిజామాబాద్ సీసీఎస్ టీం శుక్రవారం మెరుపు దాడి నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు సీసీఎస్ ఏ.సీ.పీ ఇన్ చార్జ్ మస్తాన్ ఆలి సూచనల మేరకు ఈ దాడి నిర్వహించారు. ఇన్స్ పెక్టర్ సురేష్, డి.సాయినాథ్, ఎస్.ఐ మహేష్, సిబ్బందితో కలిసి నాలుగవ పట్టణ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మెకానిక్ షెడ్డులో పిడిఎస్ బియ్యం ఉన్నాయన్న సమాచారం మేరకు సుమారు 8.5 క్వింటల్స్ పిడిఎస్ బియ్యము, పిడిఎస్ బియ్యం తరలించడానికి ఉపయోగించిన స్కూటీ ని అదుపులోకి తీసుకొన్నారు. అలాగే పిడిఎస్ బియ్యం తరలిస్తున్నటువంటి మీర్జా అబ్బాస్ బేగ్ ను అదుపులోకి తీసుకొని నాల్గవ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ కి తగు చర్య నిమిత్తం అప్పగించారు.