Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 March 2026, 8:17 pm Posted by : ramakrishna

పేకాట స్థావరం పై సీసీఎస్ టీం దాడి

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసులు బుధవారం మెరుపు దాడి నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు సీసీఎస్ ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో సీసీఎస్ సిబ్బంది రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోర్గం (పి) శివారు, భారతి గార్డెన్స్ వెనుకాల పేకాట స్థావరం పై రైడ్ చేసి నలుగురు పేకాట రాయుళ్ళను, 4 సెల్ ఫోన్ లను, 3 వాహనాలను, రూ. 6910 లను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్య నిమిత్తం రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ వో కి అప్పగించారు.