Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 March 2026, 6:12 pm Posted by : ramakrishna

పేకాట స్థావరం పై సీసీఎస్ టీం దాడి

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

సారంగ్ పూర్ లో పేకాట స్థావరంపై శనివారం సీసీఎస్ టీం మెరుపు దాడి చేసారు. నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు సీసీఎస్ ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో సీసీఎస్ సిబ్బంది ఆరవ పోలీస్ స్టేషన్ పరిధిలోని సారంగాపూర్ లో పేకాట స్థావరం పై రైడ్ చేసి ఎనిమిది మంది పేకాట రాయుళ్ళను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి  ఏడు సెల్ ఫోన్ లు, రూ. 5300 స్వాధీనం చేసుకొని తదుపరి చర్య నిమిత్తం ఆరం టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ వో కి అప్పగించారు.