నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నిజామాబాద్ నగరంలోని గాయ్రతి నగర్ పరిధిలో వ్యభిచార గృహంపై శనివారం రైడ్ నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు సీసీఎస్ ఏసీపీ ఇంచార్జ్ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో సీసీఎస్ సిబ్బంది నాల్గవ పోలీస్ స్టేషన్ గాయత్రి నగర్ పరిధిలో గల వ్యభిచార గృహంపై రైడ్ చేసి, ఇద్దరు విటుడులు, ఇద్దరు విటురాళ్లను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 5 మొబైల్ ఫోన్స్, రూ. 5690 నగదును స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్య నిమిత్తం నాల్గవ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ వో కి అప్పగించారు.