నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
అక్రమంగా తరలించడానికి నిలువ ఉంచిన పిడిఎస్ బియ్యం పై నిజామాబాద్ సీసీఎస్ టీం మెరుపు దాడి చేసి స్వాధీనం చేసుకున్నట్టు ఇన్స్పెక్టర్ డి.సాయినాథ్ తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు సీసీఎస్ ఏ.సీ.పీ ఇంచార్జ్ మస్తాన్ అలీ సూచనల మేరకు ఇన్స్పెక్టర్ డి.సాయినాథ్, ఎస్.ఐ గోవింద్, సిబ్బందితో కలిసి నిజామాబాద్ టౌన్ – 1 పోలీస్ స్టేషన్ పరిధిలోని మిర్చి కంపౌండ్, కెనాల్ కట్ట, ఎరుకలవాడ లో పిడిఎస్ బియ్యం ఉన్నాయన్న సమాచారం మేరకు షేక్ సాహెబ్ హుస్సేన్ ఇంట్లో సుమారు 40 క్వింటల్స్ పీడీఎస్ బియ్యము, పీడీఎస్ బియ్యం తరలించడానికి ఉపయోగించిన మహేంద్ర బొలేరో వాహనం (టీఎస్16యుసీ0862) సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసిన పిడియస్ బియ్యము, బొలెరో వాహనాన్ని నిజామాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ కి తగు చర్య నిమిత్తం అప్పచెప్పినట్టు ఆయన తెలిపారు.
