Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 January 2026, 9:56 pm Posted by : ramakrishna

మారుతీనగర్ లో పేకాట స్థావరం పై సీసీఎస్ దాడి

 

నిజామాబాద్, బతుకమ్మ : 

 

నగరంలోని నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరం పై సిసిఎస్ పోలీసులు దాడి చేశారు. సోమవారం సాయంత్రం పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు సి.సి.ఎస్ ఇంచార్జ్ ఏసీపీ మస్తాన్ అలీ సూచనల మేరకు గోవింద్ ఎస్సై సిబ్బంది తో కలిసి మారుతీ నగర్ లో గల ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు సీ.సీ.ఎస్ పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడి లో రూ :16,740 నగదు, 5 స్మార్ట్ ఫోన్స్ స్వాధీనపర్చుకొని పేకాట ఆడిన వారిని నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు సీ సీ ఎస్ ఎస్సై తెలిపారు.