. . . 7 మంది అరెస్ట్ . . 8 సెల్‌ఫోన్లు, 4 బైకులు సీజ్
బోధన్, బతుకమ్మ :
బోధన్ మండలం ఆమ్దాపూర్ శివారులో అక్రమంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 7 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 8 సెల్‌ఫోన్లు, 4 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్లు వెల్లడించారు. అరెస్ట్ చేసిన నిందితులను, స్వాధీనం చేసుకున్న వస్తువులతో కలిసి బోధన్ రూరల్ ఎస్సైకి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.