Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 January 2026, 7:39 pm Posted by : ramakrishna

ఆల్జాపూర్ అటవి ప్రాంతంలో పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసుల దాడి

 నవిపేట్, బతుకమ్మ:

 నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం అల్జాపూర్ శివారులో పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసులు దాడి నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు మంగళవారం సాయంత్రం సీసీఎస్ పోలీసులు అటవి ప్రాంతంలో పేకాట ఆడుతున్న 11 మందిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 10 సెల్ పోన్ లు రూ.31,410 మంది స్వాధినం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి నవిపేట్ పోలీసులకు అప్పగించారు.