సీసీ రోడ్డు పనులు ప్రారంభం

బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో 13వ వార్డులో మంగళవారం సీసీ రోడ్డు నిర్మాణ పనులను కాంగ్రెస్ నాయకులు కొబ్బరికాయ కొట్టి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ , మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఖాలేఖ్, మాజీ ఎంపీపీ ఏజజ్, మాజీ కౌన్సిలర్లు హకీమ్, రఫీ, నార్ల నందు, నార్ల ఉదయ్, దాసరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.