Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 April 2025, 11:49 am Posted by : ramakrishna

సీసీ రోడ్డు పనులు ప్రారంభం

రుద్రూర్, బతుకమ్మ  : రుద్రూర్ మండలం సులేమాన్ నగర్ గ్రామంలో ఆదివారం సీసీ రోడ్డు పనులను గ్రామ పెద్దలు  ప్రారంభించారు. మెయిన్ రోడ్డు నుంచి శ్రీ బసవేశ్వర మందిరం వరకు రూ. 20  లక్షలతో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. ఈకార్యక్రమంలో ఆలయ కమిటీ, సులేమాన్ నగర్ గ్రామ పెద్దలు దస్తగిరి, మాజీ సదర్ లతీఫ్, మాజీ సర్పంచ్ ఖాదర్, ఆరిఫ్, లింగం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.