Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 March 2026, 5:03 pm Posted by : ramakrishna

ఎల్లారెడ్డిలో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం

 

. . . మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

ఎల్లారెడ్డి మున్సిపాలిటీ మూడో వార్డులో సీసీ రోడ్డు పనులను మునిసిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ ప్రారంభించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడో వార్డులో పర్యటించిన సమయంలో స్థానిక ప్రజలు వార్డులో ఉన్న సమస్యలపై ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించారు. గత 40 సంవత్సరాల క్రితం వేసిన రోడ్లు, డ్రైనేజీలు తప్ప నేటి వరకు వార్డు అభివృద్ధి జరగలేదని ప్రజలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గెలిచిన నెల రోజుల లోపలే మూడో వార్డులో సీసీ రోడ్లు ప్రారంభించి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం గెలిచిన కేవలం 20 రోజులలోనే రోడ్డు పనులను ప్రారంభించడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ మాట్లాడుతూ, మాట ఇచ్చి నిలబెట్టుకున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఎల్లారెడ్డిని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. ఎల్లారెడ్డిని రాష్ట్రంలోనే నెంబర్ వన్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు అందరం కలిసి పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక 3 వ వార్డ్  కౌన్సిలర్ కౌసర్ ఉన్నీసా రఫీఖ్, తిరుపతి, దశరథ్, చంద్రయ్య, శంకర్, తమ్మల గాయత్రి శ్యాంసుందర్, మంచిర్యాల మహేశ్వరి విద్యాసాగర్, మున్సిపల్ కమిషనర్ మహేష్, మాజీ కోఆప్షన్ సభ్యులు మజీద్, షరీఫ్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.