కమ్మర్ పల్లి, బతుకమ్మ :
మండల కేంద్రంలోని నర్సాపూర్ గ్రామంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులు రూ.10 లక్షలతో మంజూరు అయిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను కమ్మర్ పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుంకెట రవి మంగళవారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. సబ్ స్టేషన్ నుండి స్మశాన వాటిక వరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా గ్రామస్తులు మాట్లాడుతూ నిధులు మంజూరు చేసిన నియోజకవర్గ ఇంచార్జ్ సునీల్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజీవ్, సర్పంచ్ సంధ్యరాజశేఖర్, ఉప సర్పంచ్ రాజ్ కుమార్, మండల శేఖర్, ఎర్ర గంగాధర్, సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.