సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం
బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామంలోని రెండో వార్డులో గురువారం సిసి రోడ్డు నిర్మాణం పనులను సొసైటీ ఉపాధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, గ్రామస్తులు కలిసి గురువారం ప్రారంభించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన రూ.4 లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులను చేపడుతున్నామని ఆయన తెలిపారు. పనులను నాణ్యతతో చేపట్టి త్వరితగతంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రశాంతి, ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ గంగాధర్,...