Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 March 2025, 5:57 pm Posted by : ramakrishna

సీసీ రోడ్డు నిర్మాణ పనులు  ప్రారంభం

బతుకమ్మ, పిట్లం : కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కుర్తి గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద 10 లక్షల రూపాయలతో మంజూరైన నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులను శుక్రవారం గ్రామ పంచాయతీ సెక్రెటరీ విజయ,సిపి మహేందర్ రెడ్డి,ప్రభు శెట్టి సంతోష్,సిపి సురేష్ రెడ్డి కొబ్బరికాయలు  కొట్టి సిసి రోడ్డు పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా వారుమాట్లాడుతూ జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆదేశాలతో రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగిందని,జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే  ఎంతో అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు పుల్కంటి నారాయణ,విట్టబోయిన లక్ష్మయ్య,కడపల హనుమాన్లు,విట్టబోయిన దత్తు,సుభాష్,మిరియాల జ్ఞానేశ్వర్,బ్యాగరి సాయిలు,పైలారం మైసయ్య, నిరుడి రాజు,పోతురాజు అంజయ్య,భూమేష్,కోతి కిష్టయ్య,తదితరులు పాల్గొన్నారు.