Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 March 2025, 5:39 pm Posted by : ramakrishna

సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

బతుకమ్మ : నాగిరెడ్డిపేట : మండలంలోని వెంకంపల్లి గ్రామంలో మంగళవారం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన 15 లక్షల రూపాయలతో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులను తాండూరు _ కిచన్నపేట సొసైటీ చైర్మన్ అకిడి గంగారెడ్డి గ్రామస్తులతో కలిసి కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ గంగారెడ్డి మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా మంజూరైన 15 లక్షల రూపాయల నిధులతో నూతన సీసీ రోడ్డు నిర్మాణం చేపడుతున్నామన్నారు.  ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ప్రత్యేక చొరవతో గ్రామాలలో ఏడాది కాలంలోనే పలు అభివృద్ధి. సంక్షేమ పథకాలను పూర్తి చేస్తున్నామని, త్వరలోనే  గ్రామాభివృద్ధి కి ఇంకా కొన్ని పనులు ప్రారంభిస్తామని అన్నారు. నూతన సిసి రోడ్ల నిర్మాణం కోసం 15 లక్షల నిధులు కేటాయించినందుకు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు గ్రామస్తుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పీర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

CC road construction work begins