- గుర్తింపు కోసం దరఖాస్తుతోనే తరగతులు
- అనుమతులు లేకుండానే సీబీఎస్ఈ పేరిట మోసం
- విద్యార్థులను, తల్లిదండ్రులను ముంచుతున్న ప్రైవేట్ స్కూల్స్
నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ అమ్మ వెంచర్ లో నిశిత ఇంటర్నేషనల్ స్కూల్, బైపాస్ రోడ్డులోని నూతనంగా ఏర్పాటు చేస్తున్న చైతన్య స్కూల్, చంద్రశేఖర్ కాలనీలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కు సీబీఎస్ఈ బోర్డు అనుమతి లేదని విద్యార్థి సంఘాలు గగ్గొలుపెడుతున్నాయి. నిశిత ఇంటర్నేషనల్ స్కూల్ కు దరఖాస్తు ప్రక్రియలోనే ఉండగానే ఏడాది కాలం గడిచిపోయినా సీబీఎస్ ఈ పేరిట విద్యాబోదన జరుపుతున్న ఇప్పటి వరకు సీబీఎస్ ఈ బోర్డు అధికారులు కానీ, జిల్లా విద్యాశాఖాధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చంద్రశేఖర్ కాలనీలో ఏర్పాటు చేసిన హెచ్ పీఎస్ స్కూల్ ఏడాది కాలంగా సీబీఎస్ ఈ పేరిట విద్యాబోదన చేస్తూ కర్క్యూలం అమలు చేస్తున్నామని విద్యార్థులను, తల్లిదండ్రులను మోసం చేస్తుంది. సంబంధిత పాఠశాలకు ఇప్పటికి సీబీఎస్ఈ అనుమతి లేకున్నా ఏడాది కాలాన్ని నెట్టుకొచ్చారు. నగరంలోని బైపాస్ రోడ్డులోని శ్రీచైతన్య సీబీఎస్ఈ పాఠశాలను ఏర్పాటు చేయకముందే సీబీఎస్ఈ పేరిట అడ్మిషన్లు ప్రారంభించడం గమనార్హం. కనీసం జిల్లా విద్యాశాఖ నుంచి స్టేట్ బోర్డు విద్యాబోధనకు అనుమతి తీసుకోకుండానే నూతనంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రచారం చేస్తున్నా జిల్లా విద్యాశాఖాధికారులు పట్టించుకోవడం లేదు.
సీబీఎస్ఈ అనుమతులు తీసుకోకముందే విద్యాశాఖ అనుమతి తప్పనిసరి. అదే విధంగా సీబీఎస్ఈ బోర్డు పెట్టే షరతుల ప్రకారం విద్యాబోదనకు అనుకూలంగా సకల సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ అవేమి లేకుండానే కర్క్యూలం, సెలబస్ పేరిట విద్యార్థులకు, తల్లిదండ్రులకు మోసాలకు పాల్పడుతున్నాయని, ప్రైవేట్ స్కూల్స్ కనీసం వెబ్ సైట్ లో స్కూల్ కు అనుమతి ఉందని చూపించే ధైర్యం చేయలేకపోతున్నాయి. సీబీఎస్ఈ బోర్డు అనుమతించిన రిజిస్ట్రేషన్ నంబర్ కూడా లేకుండానే బహిరంగంగా విద్యార్థుల తల్లిదండ్రులను మోసగిస్తున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ నిర్ధేశించిన ఫీజులు తీసుకోవాల్సిన చోట సీబీఎస్ఈ ఫీజులను వసూల్ చేసి బహిరంగ దోపిడికి పాల్పడుతున్నాయి. అదే విధంగా ఫీజులను బ్యాంక్ ఖాతాలో వేయించుకుని మోసగిస్తున్న సీబీఎస్ఈ బోర్డు అధికారులు కానీ, విద్యాశాఖాధికారులు కానీ పట్టించుకోవడం లేదు. విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకుని నడుస్తున్న పాఠశాలలో సీబీఎస్ఈ విద్యా పేరిట దోపిడికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. సీబీఎస్ఈ పాఠశాలలు మరికొన్ని రోజుల్లో తరగతులు ప్రారంభం కానుండగా ఇప్పటికే అనుమతులు లేకుండా అడ్మిషన్లు, ఫీజుల వసూళ్లు చేపట్టాయి.
- నిజామాబాద్ లో ఏడు స్కూళ్ళకు మాత్రమే సీబీఎస్ఈ అనుమతి
- (జిల్లా స్థాయి శిక్షణా సమన్వయకర్త మెరిగ భాస్కర్ )
నిజామాబాద్ జిల్లాలో సీబీఎస్ఈ బోర్డు అనుమతి ఏడు పాఠశాలలకు మాత్రమే ఉన్నాయి. నవ్య భారతి గ్లోబల్ స్కూల్, ఎస్ఎస్ఆర్ డిస్కవరీ స్కూల్, ఎస్ఎస్ఆర్ జన్నేపల్లి స్కూల్, నాలెడ్జ్ పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్, ప్రెసిడెన్సీ స్కూల్, సెయింట్ ఆన్స్ స్కూల్ఆర్మూర్ క్షత్రియ స్కూల్కు మాత్రమే సీబీఎస్ఈ అనుమతి ఉంది. తల్లిదండ్రులు తమ పిల్లలను ఏదైనా పాఠశాలలో చేర్పించే ముందుఆ పాఠశాల యొక్క సీబీఎస్ఈ అనుబంధ ఉత్తర్వు(అప్లియేషన్ ఆర్డర్), అనుబంధ సంఖ్యను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు.