వెబ్ న్యూస్, బతుకమ్మ : సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 12వ తరగతి ఫలితాలను మంగళవారం బోర్డు విడుదల చేసింది. విద్యార్థులు తాము సాధించిన స్కోరును మధ్యాహ్నం 12గంటల తర్వాత వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. అలాగే సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలుల నేడు వెల్లడించే అవకాశం ఉంది. మనదేశంలో 7,842 కేంద్రాలు, మరో 26 దేశాల్లో నిర్వహించిన సీబీఎస్ఈ 10,12, తరగతి పరీక్షలకు దాదాపు 42 లక్షల మంది హాజరయ్యారు. విద్యార్థుల్లో అనారోగ్యకరమైన పోటీని నివారించేందుకు సీబీఎస్ఈ బోర్డు గత కొన్నేళ్లుగా మెరిట్ జాబితాను వెల్లడించకూడదని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఫలితాల్లో 88.39 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అత్యధికంగా విజయవాడ రీజియన్ లో 99.60 శాతం, తిరువనంతపురంలో 99.32 శాతం పాస్ పర్సంటేజీ నమోదైంది. గతేడాదితో పోలిస్తే 0.41 శాతం ఉత్తీర్ణత పెరిగింది.