సీబీఎస్ఈ పదో తరగతి టాపర్స్ కు ఘన సన్మానం
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించి జిల్లాలో టాప్ లో నిలిచిన విద్యార్ధులను సన్మానించి సత్కరించింది ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థలు. ఎస్ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ సీబీఎస్ఈ స్కూల్స్ ఆధ్వర్యంలో నగరంలోని మాదవ నగర్ లో గల ఎస్ఎస్ఆర్ డిస్కవరి స్కూల్ లో బుధవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మెన్ డా. యం. మారయ్య గౌడ్, సిఈఓ హరితా గౌడ్ ఆధ్వర్యంలో పదవ తరగతి బోర్డు పరీక్షలలో అద్భుతమైన ప్రతిభ కనబరిచి...