Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 May 2025, 6:53 pm Posted by : ramakrishna

సీబీఎస్ఈ పదో తరగతి టాపర్స్ కు ఘన సన్మానం

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించి జిల్లాలో టాప్ లో నిలిచిన విద్యార్ధులను సన్మానించి సత్కరించింది ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థలు. ఎస్ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ సీబీఎస్ఈ స్కూల్స్ ఆధ్వర్యంలో నగరంలోని మాదవ నగర్ లో గల ఎస్ఎస్ఆర్ డిస్కవరి స్కూల్ లో బుధవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మెన్ డా. యం. మారయ్య గౌడ్, సిఈఓ హరితా గౌడ్ ఆధ్వర్యంలో పదవ తరగతి బోర్డు పరీక్షలలో అద్భుతమైన ప్రతిభ కనబరిచి 100 శాతం ఉత్తీర్ణత  జిల్లా టాప్ స్కోరర్ కనక్ ఇనాని 476/500, రిచా బజాజ్ 465 మార్కులు, సహస్వి శ్రీరాం 451 మార్కులు, సంవేద్య 449

CBSE Class 10th toppers felicitated

మార్కులు, సహస్ర 448 మార్కులు, శ్రీవేణు 446 మార్కులు, శివ చైతన్య 444 మార్కులు, నవ్య 443 మార్కులు, కీర్తి రెడ్డి 441 మార్కులు, యోషిత్ రెడ్డి 439 మార్కులు సాధించగా వారిని, విద్యార్ధుల తల్లిదండ్రులను సన్మానించి సత్కరించారు. ఎస్ఎస్ఆర్ సిబిఎస్ఇ స్కూల్స్ లలో చదివిన ముగ్గురు విద్యార్థులు 95 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించగా, 24 మంది విద్యార్థులు 90 శాతం కంటే ఎక్కువ మార్కులు, 34 మంది విద్యార్థులు 80 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించారు అని ఎస్ఎస్ఆర్ గ్రూప్ ఛైర్మన్ డా. మరయ్య గౌడ్ , సిఇఓ హరిత గౌడ్ విద్యార్థులను, తల్లిదండ్రులను, అధ్యాపకులను వారి అంకితభావం అసాధారణ విజయాలకుగాను అభినందించారు.

CBSE Class 10th toppers felicitated