సీబీఎస్ఈ 10వ తరగతి బోర్డు పరీక్షలు ప్రారంభం

నిజామాబాద్, బతుకమ్మ : దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ 10వ తరగతి బోర్డు పరీక్షలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో కూడా విద్యార్థులు ఉదయమే పరీక్షా కేంద్రాలకు చేరుకుని పరీక్షలు రాశారు. ప్రధానంగా నాలెడ్జ్ పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్, నవ్యభారతి, ఎస్ఎస్ఆర్ అంతర్జాతీయ పాఠశాలలు ఈ పరీక్షలకు ప్రాముఖ్యత కలిగిన కేంద్రాలుగా మారాయి. నాలెడ్జ్ పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కరస్పాండెంట్ సయ్యద్ ముజీబ్ అలీ మాట్లాడుతూ, పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు మానసిక ఒత్తిడిని దూరంగా ఉంచుకుని ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని ఆయన...