దొంగల పట్టివేత

మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ మండలం దొంపాల్ గ్రామంలో ధాన్యం చోరీకి పాల్పడిన దుండుగులను అరెస్టు చేసినట్లు ఎస్సై విక్రమ్ తెలిపారు. రోడ్డు పక్కన ఉన్న గ్రౌండ్ లో ఎర్ర గంగాధర్ అనే రైతులు ధాన్యాన్ని సంచుల్లో నింపి ఉంచగా దొంగలు ఎత్తుకెళ్లారన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, నలుగురు దొంగలను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామన్నారు.