రాష్ట్రం యూనిట్ గా కులగణన చేయాలి
ఈఅంశంపై కేంద్ర మంత్రుల కమిటీ వేయాలి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్రం యూనిట్ గా కులగణన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇలాంటి సమస్యల పరిష్కారానికి కేంద్ర మంత్రుల కమిటీ వేయాలని సూచించారు. అందులో కేంద్ర మంత్రులు, సీనియర్ అధికారులను నియమించాలన్నారు. జనగణనలో కులగణనకు కేంద్రం సమ్మతి తెలిపిన నేపథ్యంలో గురువారం హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కులగణనలో దేశానికే తెలంగాణ మోడల్ గా నిలిచిందన్నారు. అన్ని రాజకీయ పార్టీలతోను, ప్రతినిధులతోను కేంద్రం...