ఈఅంశంపై కేంద్ర మంత్రుల కమిటీ వేయాలి
సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్రం యూనిట్ గా కులగణన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇలాంటి సమస్యల పరిష్కారానికి కేంద్ర మంత్రుల కమిటీ వేయాలని సూచించారు. అందులో కేంద్ర మంత్రులు, సీనియర్ అధికారులను నియమించాలన్నారు. జనగణనలో కులగణనకు కేంద్రం సమ్మతి తెలిపిన నేపథ్యంలో గురువారం హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కులగణనలో దేశానికే తెలంగాణ మోడల్ గా నిలిచిందన్నారు. అన్ని రాజకీయ పార్టీలతోను, ప్రతినిధులతోను కేంద్రం చర్చించాలన్నారు. దేశంలోని అనేక పార్టీలు కులగణన కోరుతున్నాయన్నారు. ఇందుకోసం డిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించాయన్నారు. కులగణన నిర్ణయం తీసుకున్న కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. కులగణన అంశంపై తెలంగాణ మోడల్ తీసుకోవాలని ఆయన విన్నవించారు.