- తపస్ రాష్ట్ర బాధ్యులు కర్న శంకర్
రుద్రూర్, బతుకమ్మ : ప్రస్తుత విద్యా సంవత్సర సభ్యత్వ అభియాన్ లో భాగంగా రుద్రూర్, కోటగిరి, పోతంగల్ మండలాల్లోని వివిధ పాఠశాలలను తపస్ రాష్ట్రా బాధ్యులు కర్నె శంకర్ ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పలు పాఠశాలలను సందర్శించారు. రుద్రూర్ మండలంలోని అంబం గ్రామ శివారులోని ఆదర్శ పాఠశాలను సందర్శించి వివిధ ఉపాధ్యాయ సమస్యలపై మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయులకు క్యాష్ లెస్ హెల్త్ కార్డులను మంజూరు చేయాలని, ఎస్ జి టి ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కు కల్పించాలని, ప్రభుత్వం హామీ ఇచ్చిన 10,000 పిఎస్ హెచ్ఎం పోస్టులను భర్తీ చేయాలని ప్రాథమిక పాఠశాలలో తరగతికి ఒక ఉపాధ్యాయున్ని నియమించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న డిఏ పిఆర్సిలను వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 పద్ధు కింద జీతాలు ప్రతి నెల మొదటి తారీకున చెల్లించాలని, కేజీబీవీలలో పనిచేస్తున్న సిబ్బందికి సమ్మె కాలానికి వేతనాలు చెల్లించాలని, అదేవిధంగా వారికి మినిమం టైమ్ స్కేల్ వేతనాలు చెెల్లించాలని డిమాండ్ చేశారు. స్పందించిన ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తపస్ సంఘంలో సభ్యులుగా చేరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి కర్నె శంకర్, గాండ్ల మోహన్, కోటగిరి మండల ప్రెసిడెంట్ మహాజన్ నర్సింలు ,ప్రధాన కార్యదర్శి లోగం రాజేష్, పోతంగల్ మండల ప్రెసిడెంట్ బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.