Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 January 2026, 9:28 pm Posted by : ramakrishna

గంజాయి ని పట్టుకున్న పోలిసులకు క్యాష్ రివార్డ్

 

. . . అంద చేసిన కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర

 కామారెడ్డి, బతుకమ్మ :

కామారెడ్డి జిల్లా కేంద్రంలో  నేర నియంత్రణలో భాగంగా శనివారం రాత్రి ఆపరేషన్ కవచ్ లో భాగంగా వాహనాలను తనిఖీ లో భాగంగా గంజాయి రవాణా భగ్నం చేసిన పోలీసులు  క్యాష్ రివార్డును  కామారెడ్డి ఎస్పి రాజేష్ చంద్ర తెలిపారు. శనివారం రాత్రి దేవుని పల్లి పోలీస్ స్టేషన్ ల పరిధిలో నరసన్న పల్లి చౌరస్తా లో దేవుని పల్లి పోలీస్ స్టేషన్ ఎఎస్ఐ నర్సయ్య, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్  సుబ్బారెడ్డి, రెడ్డి నాయక్, ఏ ఆర్ కానిస్టేబుల్ సంతోష్, బలరాం లతో పాటు హోంగార్డు భూపతి వాహనాలు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆటోను తనిఖీ చేయగా గంజాయి రవాణా జరుగుతున్నట్టు గుర్తించగా ముగ్గురిని అరెస్టు చేసినట్టు తెలిపారు. జిల్లాలో నేరాల నియంత్రణ కోసం చలిని సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న వారిని అభినందించి క్యాష్ రివార్డు అందించినట్టు ఎస్పీ తెలిపారు.