క్యాష్ + క్యాస్ట్ = టీచర్ ఎమ్మెల్సీ 

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కులం కుంపట్లు ప్రధాన అభ్యర్థులంతా రెడ్డి  సామాజిక వర్గంవారే బిజినెస్ టీచర్లే ప్రజాప్రతినిధులుగా ఎన్నికకు యత్నాలు   నిజామాబాద్, బతుకమ్మ :  ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వానికి,  ఉపాధ్యాయులకు మధ్య వారధిగా ఉండాల్సిన ఎమ్మెల్సీ పదవి అంగ, అర్ధబలం ఉన్నవారితో పాటు కులం బలం ఉన్న వారే చట్టసభలకు ఎన్నికయ్యే పరిస్థితులు దాపురించాయి. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయులు ఎన్నుకునే ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలు దాదాపు ఖరారయ్యాయి. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసినా  ఎవరు కూడా తమ...