Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 May 2025, 11:00 am Posted by : ramakrishna

గంజాయి విక్రయిస్తున్న పలువురిపై కేసు నమోదు

నిజామాబాద్, బతుకమ్మ : గంజాయి విక్రయిస్తున్న పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఎన్డీపీఎస్ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా సోమవారం రాత్రి ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం నిర్వహించిన తనిఖీల్లో వేల్పూర్ గ్రామంలో గంజాయి విక్రయిస్తున్న యాళ్ల రిశ్వంత్ ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 750 గ్రా.గంజాయిని,  బైకు, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు.  అనంతరం ఆర్మూర్ పట్టణంలో సోదాలు నిర్వహించి షేక్ సమీర్, షేక్ కలీం అనే వ్యక్తుల నుంచి 2.3 కిలోల గంజాయిని, రెండు బైకులు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో సీఐ వెంకటేష్, ఎస్సై నరసింహ చారి, సిబ్బంది భూమన్న, గంగారం, విష్ణు, సాయి కుమార్ పాల్గొన్నారు.