ట్రాక్టర్లు డ్యామేజ్ చేసిన ఘటనపై కేసు నమోదు
ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి మండల కేంద్రానికి చెందిన జనుముల భూమయ్య నాలుగు నెలల క్రితం ఎల్లారెడ్డి శివారులో ఉన్న భూమిని అగల్ దివిటి సంగమ్మ నుండి కొనుగోలు చేశాడు. అయితే ఆ భూమి విషయంలో గతంలో సంగమ్మ కుటుంబ సభ్యులు, ఆమె పక్క పొలం యజమాని రోడ్డ నరేష్, అతని తండ్రి నరసింహులు మధ్య వివాదాలు జరిగినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, భూమయ్య తన వ్యవసాయ పనుల కోసం ఒక ట్రాక్టర్ కొనుగోలు చేసి, తాను కొనుగోలు చేసిన వ్యవసాయ...