Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 April 2025, 9:23 pm Posted by : ramakrishna

యువతి అదృశ్యం కేసు నమోదు

ఎల్లారెడ్డి, బతుకమ్మ :ఎల్లారెడ్డి మండలం అల్మాజిపూర్ గ్రామానికి చెందిన ఎరుకల మధుమతికి సంవత్సరం క్రితం జంగమయ్యపల్లి గ్రామానికి చెందిన మహేందర్ తో వివాహం జరిగింది వారిద్దరి మధ్య గొడవల కారణంగా గత నాలుగు నెలల నుండి మధుమతి అల్మాజిపూర్ గ్రామం నందు తన అమ్మగారి ఇంటి వద్దనే ఉంటుంది. ఈనెల తేదీ నాలుగో తారీఖు నాడు మధుమతి మరియు ఆమె అమ్మ అయిన  సుగుణ ఆమె తమ్ముడు అందరూ కలిసి తిని రాత్రి 10 గంటలకు పడుకున్నారని డ్యూటీకి వెళ్లిన మధుమతి తండ్రి అయిన పోచయ్య అర్ధరాత్రి 12 గంటలకు ఇంటికి వచ్చినప్పుడు మేల్కొని చూడగా మధుమతి ఇంట్లో కనిపించలేదు అని తనకోసం చుట్టుపక్కల తెలిసిన వారి వద్ద వెతకగా తన ఆచూకీ దొరకకపోవడంతో మధుమతి తండ్రి అయిన పోచయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపినారు.