ఏర్గట్లలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా కేసు నమోదు

  ఏర్గట్ల, బతుకమ్మ :   ఏర్గట్ల పరిధిలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించిన కేసును పోలీసులు నమోదు చేశారు. డిప్యూటీ తహసీల్దార్ (సివిల్ సప్లైస్) వి. పవన్ కుమార్ ఫిర్యాదు మేరకు, ఏర్గట్ల పోలీస్ స్టేషన్‌లో సీఆర్.నెం. 29/2026గా కేసు నమోదైంది. టాస్క్ ఫోర్స్ అధికారుల విశ్వసనీయ సమాచారం ఆధారంగా, 2026 ఏప్రిల్ 28 అర్ధరాత్రి సమయంలో టీఎస్16 యుడి 3297 నంబర్ గల గూడ్స్ వాహనాన్ని అధికారులు పట్టుకున్నారు. ఆ వాహనంలో మొత్తం 77 పీడీఎస్ బియ్యం సంచులు ఉన్నట్లు...