Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 March 2025, 9:02 pm Posted by : ramakrishna

బెదిరింపులకు పాల్పడుతున్న ఇద్దరు ఆన్లైన్ రిపోర్టర్ల పై కేసు నమోదు

బతుకమ్మ భిక్కనూరు : భిక్కనూరు గ్రామానికి చెందిన లింగాల నవీన్ గౌడ్, అర్జున్ ఒక ఆన్లైన్ పత్రిక, యూట్యూబ్ ఛానల్ లో పనిచేస్తూ బెదిరింపులకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు భిక్కనూరు ఎస్సై ఆంజనేయులు గురువారం తెలిపారు. భిక్కనూరు గ్రామంలోని శ్రీ సిద్ధ రామేశ్వర బజాజ్ షోరూం లోకి చొరబడి  యజమానితోపాటు అందులో పని చేస్తున్న వర్కర్లపై బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపారు. ఈ సందర్భంగా షోరూం యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.